రాయచోటి
మండల పరిధిలోని చెన్నముక్కపల్లిలో ఉన్న లయన్స్ కంటి ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరంలో 17 మంది కంటి రోగులకు ఆపరేషన్లు నిర్వహించారు ఈ సందర్భంగా రాయచోటి నియోజకవర్గంతో పాటు జిల్లా పరిధిలోని రాజంపేట, రైల్వేకోడూరు, కలికిరి, కలకడ, గుర్రంకొండ, పెద్దమండెం, యర్రా వారిపాలెం, కేవీ పల్లి, కదిరి, ఎన్‌పి కుంట తదితర ప్రాంతాల నుంచి వచ్చిన 50 మంది కంటి రోగులకు పరీక్షలు నిర్వహించారు. అందులో అర్హులైన 17 మంది ఆపరేషన్లు చేశారు. గతంలో ఆపరేషన్ చేయించుకున్న 35 మంది కంటి రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా అద్దాలు, మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో లయన్స్ కంటి ఆసుపత్రి చైర్మన్ వైవిఆర్ స్వరూప్ గుప్తా, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చెన్నూరు అన్వర్ బాష, కంటి వైద్యులు సురేష్ బాబు, మహాలక్ష్మి, భార్గవి, ఆప్త్మాలిక్ అసిస్టెంట్ మూలి రాజగోపాల్ రెడ్డి, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.










