Jul 11,2021 20:10

తిరువనంతపురం : కేరళలోని శబరిమల ఆలయం ఈ నెల 16 నుండి తెరుచుకోనుంది. 17 నుండి సందర్శకులను అనుమతించనున్నట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రకటించారు. ఈ నెల 17 నుండి 21 వరకూ రోజుకు గరిష్టంగా ఐదు వేల మందిని మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. రెండు డోసుల కరోనా టీకా తీసుకున్న వారికి లేదా 48 గంటల్లోపు జారీ చేసిన ఆర్‌టి-పిసిఆర్‌ పరీక్ష నెగిటివ్‌ ధ్రువపత్రం ఉన్న వారిని మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తామని విజయన్‌ పేర్కొన్నారు. కోవిడ్‌ నిబంధనల కారణంగా మే నుండి శబరిమల ఆలయాన్ని మూసివేశారు.