వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న నాయకులు
15న ప్రజ్ఞావికాసం వాల్‌పోస్టర్ ఆవిష్కరణ
నెల్లూరు:ఈ నెల 15వ తేదిన ఎస్‌ఎఫ్‌ఐ, యుటిఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్ధులకు ప్రజ్ఞావికాసం పేరుతో నిర్వహించబోవు పరీక్షలకు సంబంధించిన వాల్‌పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ పాల్గొంది. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ నాయకులు మాట్లాడుతూ ప్రముఖ విద్యావేత్త కె. ఎస్.లక్ష్మణరావు పర్యవేక్షణ లో ఈనెల 15వ తేదీన జరుగుతున్న 10 వ తరగతి ప్రజ్ఞావికాసం కార్యక్రమానికి అధిక సంఖ్యలో విద్యార్ధులు పాల్గొని కార్యక్రమాన్ని ను జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు శ్రీ హర్ష ,నెల్లూరు నగర అధ్యక్ష, కార్యదర్శి %ఙ%.నరేంద్ర ,అనిల్ నెల్లూరు రూరల్ ఉపాధ్యక్షుడు సిసింద్రీ, ప్రశాంత్ ,సుమన్, తదితరులు పాల్గొన్నారు...










