ఫొటో : వివరాలను వెల్లడిస్తున్న ఎస్‌ఐ శ్రీనివాసులరెడ్డి
150 మద్యం సీసాలు స్వాధీనం
ప్రజాశక్తి-అల్లూరు : మండలంలోని బీరంగుంట పంచాయతీ రైస్‌మిల్ కాలనీ వద్ద శుక్రవారం జరిగిన ప్రమాదంలో 150 అక్రమ మద్యం బాటిళ్లు బయటపడినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విడవలూరు మండలం పార్లపల్లి గ్రామానికి చెందిన జానా నాగరాజు, సాయి అనే ఇద్దరు వ్యక్తులు వావిళ్ల మద్యం షాపులో కాటంగారి మహేష్ అనే వ్యక్తి వద్ద మద్యాన్ని కొనుగోలు చేసి యూనికాన్ బైక్‌పై వస్తూ ఉండగా అదుపుతప్పి పడిపోయినట్లు వివరించారు. వెంటనే ఆ ఇద్దరిని అలాగే మద్యం అమ్మిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని మద్యాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు. అందులో కొన్ని మద్యం బాటిళ్లు పగిలిపోయాయని తెలియజేశారు.










