Oct 11,2023 22:18

ప్రజాశక్తి-గుంటూరు:ప్రజారోగ్యం ప్రజలందరి హక్కుగా ఉండాలని, వైద్య ఆరోగ్య రంగానికి కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లలో నిధులు పెంచాలని తదితర డిమాండ్లతో 'వైద్యాంప్రజారోగ్యం' అనే అంశంపై ఈ నెల 15న సిపిఎం ఆధ్వర్యంలో గుంటూరులో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.నేతాజి తెలిపారు. గుంటూరులోని సిపిఎం కార్యాలయంలో సదస్సు పోస్టర్‌ను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌ఆర్‌ఐ మెడికల్‌ కాలేజి ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎ.సత్యనారాయణ ప్రసాద్‌ అధ్యక్షతన జరిగే ఈ సదస్సును ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు ప్రారంభిస్తారన్నారు. 'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య విధానాలుాప్రస్తుత పరిస్థితులు' అనే అంశంపై జెవివి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ యం.గేయానంద్‌, 'ఆంధ్రప్రదేశ్‌లో ప్రజారోగ్యాంప్రస్తుత పరిస్థితులు' అనే అంశంపై నెల్లూరు పీపుల్స్‌ పాలీక్లినిక్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బి.రాజేశ్వరరావు, ఆరోగ్య హక్కు చట్టాం2023పై ప్రజారోగ్య వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు డాక్టర్‌ కె.సాయిప్రసాద్‌ ప్రసంగిస్తారని తెలిపారు. నెఫ్రాలజీ వైద్యులు గొంది శివరామయ్య, ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ ఎం.వి.రమణయ్య, టి.కామేశ్వరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు తదితరులు పాల్గంటారన్నారు. వైద్యం, ప్రజారోగ్యాన్ని ప్రభుత్వాలు బాధ్యతగా తీసుకోవాలని జరిగే ఈ సదస్సును జయప్రదం చేయాలని కోరారు. పోస్టర్‌ ఆవిష్కరణలో ప్రజారోగ్యవేదిక నాయకులు ఎల్‌.ఎస్‌.భారవి, సిపిఎం నగర కార్యదర్శి కె.నళినీకాంత్‌, నాయకులు బి.లక్ష్మణరావు, ఖాసిం షహీద్‌, కృష్ణకాంత్‌, నికల్సన్‌, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.