ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీ నుంచి నిర్వహించనున్న జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను జయప్రదం చేయాలని జాయింట్ కలెక్టర్ కేతన్‌గార్గ్ పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్ ఎల్‌ఎం.ఉమా మోహన్‌రెడ్డి, నగర మేయర్ వసీం , ఉప మేయర్ కోగటం విజయభాస్కర్‌రెడ్డి, వాసంతి సాహిత్యతో కలిసి వారోత్సవాల పోస్టర్లను జేసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాల సేవలు ప్రజలకు చేరువ చేయడానికి వారోత్సవాలు ఉపయోగపడతాయని తెలిపారు. 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ వివిధ కార్యక్రమాలతో పాఠకులను ఆకట్టుకునేలా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లైబ్రేరియన్ వి.సుబ్బరత్నమ్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ ఎల్‌ఎం.మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.