Aug 05,2022 22:44

ప్రజాశక్తి -నందిగామ
ఆగస్టు 14న నందిగామ మండలంలో అన్ని గ్రామాల్లో కార్మిక సంఘ కార్యాలయాల్లో ఆగస్టు 14న జనజాగరణ జయప్రదం చేయాలని సిఐటియు ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి ఏ కమల పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం నందిగామ సిఐటియు మండల స్థాయి వర్క్‌ షాప్‌ జరిగింది. ఈ వర్క్‌ షాప్‌లో పాల్గొన్న కమల మాట్లాడుతూ అగస్టు 14 జన జాగరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు . కాంట్రాక్ట్‌ అవుట్సోర్సింగ్‌ పని చేస్తున్న కార్మికులందరికీ కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సెప్టెంబర్‌ 20వ తేదీన ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నందిగా మండల కార్యదర్శి కే గోపాల్‌, అధ్యక్షురాలు సుశీల, కమిటీ సభ్యులు కర్రీ వెంకటేశ్వరరావు, తాటి తులసమ్మ, కోయ నాగేంద్రం, పుట్ట మాణిక, ఆకులు బేబీ, కవిత, బిల్డింగ్‌ యూనియన్‌ హస్సన్‌, వీఆర్‌ఏ సైదులు పాల్గొన్నారు.