Jan 10,2023 20:35

కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న నాయకులు

కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న నాయకులు
12న సంక్రాంతి సాంస్కృతిక సంబరాలు
నెల్లూరు:ఈ నెల 12వ తేదిన డాక్టర్‌ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సాంస్కృతిక సంబరాలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్‌ నిర్వహణ కమిటీ కార్యదర్శి ఆర్‌ నగేష్‌ తెలిపారు. మంగళవారం నగరంలోని డాక్టర్‌ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 12వ తారీకున జరుగుతున్న సంక్రాంతి సంబరాలకు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ సంబరాలు మరుగున పడిపోతున్న జానపద కళారూపాలకు చేయూత ఇవ్వాలనే ఉద్దేశంతో, చదువే ప్రపంచంగా బతుకుతున్న విద్యార్థులకు ఘనమైన మన సంస్కతిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీలల్లో మహిళలచే రంగవల్లుల పోటీలు, గంగిరెద్దుల ఆటలు, జడకోపు, కోలాటం, శాస్త్రీయ నత్యాలు, యోగివేమన నాటకం వంటి కార్యక్రమాలను జనవరి 12వ తారీకు మధ్యాహ్నం 3 గం.ల నుంచి నిర్వహిస్తున్నామని దీనిలో ప్రజలందరూ పాల్గొనాలని కోరారు
. ఈ కార్యక్రమానికి ఎంఎల్‌సి విఠపు బాలసుబ్రహ్మణ్యం, జిల్లా పరిషత్‌ ముఖ్యకార్యదర్శి చిరంజీవి, 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలియజేశారు. ఈ సమావేశంలో ట్రస్ట్‌ నిర్వహణ కమిటీ సభ్యులు యం. పుల్లయ్య, జయరామ రెడ్డి, నరసింహారెడ్డి, ప్రజానాట్యమండలి సీనియర్‌ నాయకులు విజరు కుమార్‌, జక్కా వెంకయ్య సహకార స్టోర్స్‌ కార్యదర్శి యల్‌. వెంకటేశ్వర్లు, మహిళా సంఘం సభ్యులు విజయలక్ష్మి, శ్రావణి, లావణ్య, తదితరులు పాల్గొన్నారు.