Jul 14,2021 08:58

వాషింగ్టన్‌ : ఇద్దరు భారతీయ అమెరికన్‌లతో పాటు 11మందిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కీలక పదవులకు నామినేట్‌ చేశారు. నేషనల్‌ డ్రగ్‌ కంట్రోల్‌ పాలసీ డైరెక్టర్‌గా రాహుల్‌గుప్తాను, అరియాడ్నే ల్యాబ్‌ వ్యవస్థాపకుడైన అతుల్‌ గవాండేను బ్యూరో ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటర్‌గా అతుల్‌ గవాండేలను నియమించారు. భారతీయ దౌత్యవేత్త కుమారుడైన రాహుల్‌ గుప్తా భారత్‌లో జన్మించారు. వాషింగ్టన్‌ డిసిలో పెరిగారు. ఆరోగ్య సమస్యలపై జాతీయంగా, అంతర్జాతీయంగా వినూత్న విధానలను ప్రవేశపెట్టారు. పలు ఆరోగ్య సంస్థలు, టాస్క్‌ఫోర్స్‌లకు సలహాదారుగా పనిచేస్తున్నారు. ఎబోలా వైరస్‌ వ్యాధి వ్యాప్తి సమయంలో రాష్ట్ర జికా కార్యాచరణ ప్రణాళిక, సంసిద్ధత ప్రయత్నాల అభివృద్ధికి నేతృత్వం వహించారు. కరోనా వైరస్‌ మహమ్మారి సమయంలో కరోనా పరీక్షలు, వ్యాక్సిన్‌లను అందించే జాతీయ సంస్థ సిఐసి హెల్త్‌ను స్థాపించారు. అలాగే బైడెన్‌ ట్రాన్సిషన్‌ కరోనా ప్రచార బోర్డు సభ్యుడిగా పనిచేశారు. వీరిద్దరితో పాటు గేట్‌ కమరిలో, అలాన్‌, ఎస్టీవెజ్‌, జెఫ్‌ లేన్‌ ఫ్లేక్‌, కెంట్‌ డోయలే లాగ్స్‌డాన్‌, లిసా వాంగ్‌, చెస్టర్‌ జాన్‌ కల్వర్‌, రిచ్‌ ట్రుంకా జూనియర్‌, జేమ్స్‌ ఎ డియోసా, టెరెన్స్‌ కే రైట్‌లను పలు కీలక పదవుల్లో నియమించినట్లు వైట్‌ హౌస్‌ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.