Feb 07,2023 20:52

- జాబ్‌మేళా పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ గిరీష

 రాయచోటి : జిల్లాలోని మదనపల్లె ప్రభుత్వ బీటీ కళాశాల ఆవరణంలో ఈనెల 10న మెగా జాబ్‌ మేళా నిర్వహించనున్నామని కలెక్టర్‌ గిరీష తెలిపారు. మంగళవారం తన ఛాంబర్‌లో మెగా జాబ్‌ మేళా పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శుక్రవారం ఉదయం 10 గంటలకు మదనపల్లె ప్రభుత్వ బీటీ కళాశాల ఆవరణంలో జిల్లా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వారు మెగా జాబ్‌ మేళా నిర్వహిస్తారని చెప్పారు. జాబ్‌ మేళాకు రాష్ట్రంలోని వివిధ బహుళ జాతీయ కంపెనీలకు చెందిన దాదాపు 50 నుంచి 60 మంది ప్రతినిధులు హాజరవుతారన్నారు. ఇప్పటివరకు మహిళా సంఘాలు, గ్రామ వార్డు సచివాలయాల ద్వారా 8 వేల మంది అభ్యర్థులను రిజిస్టర్‌ చేసుకున్నారని తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు జాబ్‌ మేళాకు హాజరై ఉపాధి అవకాశాలు పొందాలన్నారు. ఎంపీ మిధున్‌ రెడ్డి, మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్‌బాష ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్‌ మేళాకు దాదాపు పదివేల మంది పైచిలుకు నిరుద్యోగ యువత హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేశామని చెప్పారు. కార్యక్రమంలో డిఆర్‌డిఎ పీడీ సత్యనారాయణ, జిల్లా స్కిల్‌ డెవలప్మెంట్‌ అధికారి హరికష్ణ, సీడాప్‌ మేనేజర్‌ వేణుమాధవ్‌ పాల్గొన్నారు.