Jan 08,2023 21:39

ఫొటో : మాట్లాడుతున్న నెల్లూరు పార్లమెంట్‌ ఇన్‌ఛార్జి అబ్దుల్‌ అజీజ్‌

10న చలో కావలి
ప్రజాశక్తి-కావలి : 10వ తేదీన ''చలో కావలి'', 18 నుండి టిడిపి ఇంటింటి ప్రచారం కార్యక్రమాలను జయప్రదం చేయాలని నెల్లూరు పార్లమెంట్‌ ఇన్‌ఛార్జి అబ్దుల్‌ అజీజ్‌, కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం కావలి పట్టణ కోర్టు వెనకవైపు ఉన్న క్లాత్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ కళ్యాణమండపంలో కావలి నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో వారితో పాటు ఉదయగిరి మాజీ శాసనసభ్యులు కంభం విజయరామిరెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ 10వ తేదీన కావలిలో జరిగే చలో కావలి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు.
అలాగే కావలి నియోజకవర్గంలో ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం చెప్పడతారని, ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలను, నియోజకవర్గ ప్రజలను కోరారు. ఈ సందర్భంగా చలో కావలి గోడపత్రికలను నేతలు ఆవిష్కరించారు. సమావేశంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరూ పాల్గొన్నారు.