Sep 24,2023 21:10

ప్రజాశక్తి - సీతమ్మధార (విశాఖపట్నం) :కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ పథకాలను సోషల్‌ మీడియా వలంటీర్లు ప్రజలకు చేరువ చేయాలని కేంద్ర స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. విశాఖలోని సాగరమాల ఆడిటోరియంలో బిజెపి సోషల్‌ మీడియా వలంటీర్ల సమావేశం ఆదివారం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఆమె హాజరై మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రధాని మోడీ అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్‌ రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను పురంధరేశ్వరి ఎండగడుతుంటే కొంతమంది ఓర్వలేకపోతున్నారన్నారు. సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పదేళ్లుగా బెయిల్‌పై ఉన్న విషయాన్ని వైసిపి నాయకులు గుర్తెరగాలన్నారు. రాష్ట్రంలోని పరిణామాలను కేంద్రం గమనిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపి జివిఎల్‌.నరసింహారావు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధరేశ్వరి పాల్గొన్నారు.