కృష్ణా జిల్లా: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు , జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన గుడివాడలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు కోటలో ఉన్నా ఒకటే.. పేటలో ఉన్నా ఒకటేనని అన్నారు. పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడుతూ.. కరిచే కుక్క మొరగదని.. మొరిగే కుక్క అరవదని అన్నారు. పవన్ రూపాయి.. పావలా అని అంటున్నారని.. అంటే వైసీపీకి 125 సీట్లు వస్తాయని.. పావలా కళ్యాణ్‌కు వారి వుమ్మడి కూటమికి 25 సీట్లు వస్తాయని అర్ధం వచ్చినట్లు ఆయనే మాట్లాడుతున్నారని అన్నారు. పావలా కళ్యాణ్‌కు 25... రూపాయి పావలా పార్టీ అన్న పార్టీకి 125 అని పవన్ మనసులో అర్ధం అనుకుంటా.. అంటూ కొడాలి నాని పేర్కొన్నారు.










