Apr 12,2023 15:18
  •  మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి

ప్రజాశక్తి-ఉరవకొండ : గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం వ్యవస్థను గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి దక్కుతుందని ఉరవకొండ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఉరవకొండ మండలంలోని మోపిడి గ్రామంలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ సచివాలయ భవనాన్ని సర్పంచ్ సిద్దార్థతో కలిసి మాజీ ఎమ్మెల్యే బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ గ్రామ సచివాలయాల ద్వారా వివిధ శాఖల,సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయన్నారు. ముఖ్యమంత్రి ముందుచూపుతో ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ దేశ విదేశాల్లో సైతం ఖ్యాతి గడించిందన్నారు. ఇతర రాష్ట్రాలు సైతం ఈ వ్యవస్థను ప్రవేశపెట్టే ఏర్పాటు చర్యలు చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి చంద్రమ్మ, జెడ్పిటిసి పార్వతమ్మ, వైస్ ఎంపీపీ నరసింహులు, ఆమిద్యాలపిఏసీఎస్ చైర్మన్ తేజోనాథ్, నాయకులు అశోక్ కుమార్, గోవిందు, ఆమిద్యాల రాజేష్, మోపిడి నాయకులు ఆంజనేయులు, సుధాకర్, రామకృష్ణ, నాగరాజు, లాలెప్ప, ఆనంద్, భారతి, ప్రసాద్, మారెప్ప, పెద్దన్న, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.