- రోడ్డు పనుల కోసమే అక్కడి నుండి తీశాం..
- నగర కమిషనర్ డా. జె అరుణ
ప్రజాశక్తి-చిత్తూరు : జాతీయ రహదారి-4 విస్తరణలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తీసి, సురక్షిత ప్రాంతంలో ఉంచడం జరిగిందని నగర కమిషనర్ డా. జె అరుణ చెప్పారు. బుధవారం మధ్యాహ్నం నగరపాలక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ.. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా వై జంక్షన్ అభివృద్ధి, ఆరు వరసల రహదారి, ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరగవలసిన నేపథ్యంలో విగ్రహాన్ని తగిన జాగ్రత్తలతో అక్కడి నుండి తీసి సురక్షితంగా నగరపాలక సంస్థ ఆధీనంలో ఉంచడం జరిగిందన్నారు. విగ్రహాన్ని సురక్షితంగా ఉంచిన ఫోటోలను కమిషనర్ చూపించారు. నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత తగిన ప్రదేశంలో విగ్రహాన్ని ఉంచడం జరుగుతుందన్నారు.










