ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రమైన నార్పల్లో శనివారం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు బస్టాండ్ ఆవరణంలోని శివ కళ జ్యోతి సర్కిల్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఆయనకు నివాళులు అర్పించి అనంతరం కేకు కట్ చేశారు ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకులు సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ తన పాలనా కాలంలో రైతుల అభ్యున్నతి కి కృషి చేసిన రైతు బాంధవుడు రాజశేఖర్ రెడ్డి అని ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నంతకాలం ఆయన ఎల్లవేళలా రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరంజీవిలా ఉంటారని అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నాగేశ్వరరావు సర్పంచ్ మనీల సుప్రియ ఉప సర్పంచ్ గవ్వల శ్రీరాములు దుర్గం సర్పంచ్ రామాంజనేయులు వైఎస్ఆర్సిపి దళిత నాయకుడు వేదాంతం మోహన్ మనీల శివయ్య చికెన్ గోపాల్ బాలనాగ బాలకృష్ణ డీలర్ అసోసియేషన్ మండల అధ్యక్షులు బారిక నరసింహులు వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. సుల్తాన్ పేటలో వైయస్సార్ విగ్రహానికి స్థానిక నాయకులు జయరాం రెడ్డి మల్లికార్జున్ రెడ్డి నాగభూషణ్ రెడ్డి భీమిరెడ్డి లక్ష్మిరెడ్డి బాలకృష్ణారెడ్డి భాస్కర్ రెడ్డి వెంకట్రామిరెడ్డి శివారెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించే కోశారు నాదే విధంగా వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి మిద్దె కుల్లాయప్ప ఆధ్వర్యంలో వైయస్సార్ 74 జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు మండలంలోని పలు గ్రామాల్లో స్థానిక వైసీపీ నాయకులు వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి కేక్ కట్ చేసి ఘనంగా వైఎస్ఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు










