Jun 21,2023 16:21

ప్రజాశక్తి-తాడేపల్లిగూడె : శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాల జాతీయ సేవా పథకం విభాగం ఆధ్వర్యంలో  యోగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.విద్యార్థులు కళాశాల నుండి పెదతాడేపల్లి రోడ్డు వరకు యోగా ప్రాముఖ్యతను వివరిస్తూ పలు ప్రదర్శనల ద్వారా అవగాహాన ర్యాలనిర్వహించారు. ప్రోగ్రాం ఆఫీసర్‌ మరియు బిఎస్‌హెచ్‌ విభాగాధిపతి ఎన్.రాజశేఖర్ ర్యాలీని ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ సైనికాధికారి డి.వెంకటేశ్వర రావు యోగా ఆవశ్యకతను వివరించి,పలు యోగా ఆసనాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో కళాశాల పాలక వర్గ కార్యదర్శి చలంచర్ల సుబ్బారావు, కోశాధికారి బాల కాశయ్య, టెక్నికల్ డైరక్టర్  చెక్కా అప్పారావు, ఇంజనీరింగు కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ రాంబాబు, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ భాస్కరరాజు  ఎన్ఎస్ఎస్ విభాగాల కో ఆర్డినేటర్లు,వివిధ విభాగాల అధిపతులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.