ప్రజాశక్తి-కాళ్ల : ఎన్ని అడ్డంకులు వచ్చినా సంక్షేమ పథకాలను ఆపకుండా ముందుకు సాగిస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని డిసిసిబి చైర్మన్ నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ పివి ఎల్ నరసింహారాజు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా కాళ్ళ మండలంలో వైసిపి నాలుగేళ్ల పాలనకు మద్దతుగా డిసిసిబి చైర్మన్, ఉండి నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ పివిఎల్ నరసింహారాజు ఆధ్వర్యంలో భారీ బైక్‌ర్యాలీ సోమవారం నిర్వహించారు. పెదఅమిరం గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం నుండిబైక్ ర్యాలీ నిర్వహించారు. పెదఅమిరం, జక్కరం, కాళ్ళ, జువ్వలపాలెం, ఏలూరుపాడు వంతెన వరకు సాగింది.ఈ సందర్భంగా డిసిసిబి చైర్మన్ పివి ఎల్ నరసింహారాజు మాట్లాడుతూ టిడిపి అధినేత చంద్రబాబు పేదల ఇళ్ల స్థలాలను స్మశాన వాటికతో పోల్చి పేదలను దారుణంగా అవమానించారని, టీడీపీ దుర్మార్గపు వైఖరిని నిరసిస్తూ ఉండి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ విజయవంతంగా చేపట్టామన్నారు.టిడిపి ఎన్ని అడ్డంకులు పెట్టిన ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చే విధంగా ముందు సాగుతున్నామన్నారు. ఈ ర్యాలీలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి శ్రీనివాసరాజు, పెన్మెత్స విశ్వనాథరాజు, జడ్పిటిసి పచ్చిగోళ్ళ సోమేశ్వరరావు, కోపల్లె సొసైటీ అధ్యక్షులు వేగేశ్న జయ రామకృష్ణంరాజు, కలవపూడి సొసైటీ అధ్యక్షులు పెన్మెత్సదుర్గా ప్రసాదరాజు, వైసిపి మండల కన్వీనర్ గణేశ్న రాంబాబు, వేగేశ్న బాల గణపతి వర్మ, సాగిరాజు హరి వర్మ , కఠారి లక్ష్మీపతి రాజు, దాట్ల శ్రీనివాసరాజు, పెదఅమిరం గ్రామ సర్పంచ్ డొక్కు సోమేశ్వరరావు,ఉప సర్పంచ్ జవ్వాది కిషోర్, కొలుకులూరి ధర్మరాజు, వైసిపి నాయకులు గుల్లపల్లి అచ్చారావు,.మండల కన్వీనర్లు గణేశ్న రాంబాబు, సొసైటీల చైర్మన్లు వేగేశ్న జయరామ కృష్ణంరాజు, కేశిరెడ్డి మురళి, పేరిచర్ల సూర్యనారాయణరాజు, నియోజకవర్గంలోని ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.










