ప్రజాశక్తి-వెదురుకుప్పం : మండలం వైఎస్సార్ సీపీ యూత్ అధ్యక్షుడు బొడిరెడ్డి నరేష్ రెడ్డి పదవి కాలం పొడిగించారు. పార్టీలో చురుగ్గా పాల్గొని పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని డిప్యూటీ సీఎం నారాయణస్వామి బొడిరెడ్డి నరేష్ రెడ్డిని ఆదివారం ఆదేశించారు. కొని కారణాల వల్ల గత ఐదు నెలలుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న లేదని ఇక పై పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ మండల ప్రజలకు, వైఎస్ఆర్సిపి నాయకులకు, కార్యకర్తలకు, యువకులకు.. అందుబాటులో ఉంటానని డిప్యూటీ సీఎం సమక్షంలో నరేష్ రెడ్డి స్పష్టం చేశారు. త్వరలో పచ్చి కాపల్లం పంచాయతీ లో జరిగే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి సూచించారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ చల్లంపాళ్యెం సుకుమార్, మాజీ ఎంపిటిసి బండి రోశిరెడ్డి,కామసాని పద్మనాభ రెడ్డి, వైఎస్సార్ సీపీ యువ నేత దామోదర్ రెడ్డి.










