Jun 18,2023 14:36
  • యశోదరెడ్డి నోరు అదుపులో పెట్టుకో...?
  • జ్ఞానేంద్ర రెడ్డి పేరు ఎత్తితే దూది మోహన్ చిట్టా విప్పుతా
  • టిడిపి నుంచి వచ్చి వైసీపీలో కృష్ణారెడ్డి రాజకీయాలు చేయడం నీచం
  • నేటికీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ సురేష్ రెడ్డి

ప్రజాశక్తి-పెనుమూరు : చిత్తూరు జిల్లాలో ఎంతో రాజకీయ చరిత్ర కలిగిన మహాసముద్రం కుటుంబంను పెనుమూరు మండలంకు చెందిన కొందరు చోట నాయకులు విమర్శించడం తగదని రాబోయే రోజుల్లో వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కొక్క తప్పవని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత జిల్లా కార్యదర్శి గిరిధర్ రెడ్డి హెచ్చరించారు. ఆదివారం పులిగుండు వద్ద గుంటిపల్లె ఎంపీటీసీ  సెగ్మెంట్ పరిధిలోని గుంటిపల్లె, గుడ్యానం పల్లె,  పెద్ద కావూరువారి పల్లె పంచాయతీకి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ గత 42 సంవత్సరాలుగా మండలంలో కాంగ్రెస్ పార్టీ నుండి ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు మహాసముద్రం కుటుంబం ప్రజలకు అండగా నిలుస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఐదు పర్యాయాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో మహాసముద్రం కుటుంబ విజయాలకు ప్రతిపక్షాలు అడ్డు కట్ట వేయ లేదని చెప్పారు. ఇలాంటి మండలంలో కొందరు చోట నాయకులు ఆ కుటుంబాన్ని విమర్శిస్తూ రాజీనామాలు చేయమనడం మంచి పద్ధతి కాదని చెప్పారు. సాతంబాకం ఎంపీటీసీ సభ్యురాలు యశోద రెడ్డి  రెండు పర్యాయాలు మహాసముద్రం కుటుంబం వల్లే గెలిచి జ్ఞానేంద్ర రెడ్డి కుటుంబంను వైసిపి పార్టీకు రాజీనామ చేయ మనడం విడ్డూరంగా  ఉందన్నారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే ఆమె భర్త అవినీతి చిట్టా విప్పుతామని హెచ్చరించారు. సాతంభాకం కృష్ణారెడ్డి టిడిపి పార్టీ నుండి లబ్ధి పొందేందుకు  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి గ్రూప్ రాజకీయాలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లిచినట్టుగా ఉందన్నారు. ఎప్పటికీ జగన్ సీఎం కారని నారాయణస్వామి ఎమ్మెల్యే కూడా కారని విమర్శించిన కృష్ణారెడ్డి  ఇప్పుడు డిప్యూటీ సీఎం దగ్గర చేరి  మహాసముద్రం కుటుంబం విమర్శించడం మంచి పద్ధతేనా అంటూ ప్రశ్నించారు. తాను మండల కన్వీనర్ అని చెప్పుకుంటున్న కామసాని విజయకుమార్ రెడ్డి జ్ఞానేద్ర రెడ్డి కుటుంబం ద్వారా లబ్ది పొంది భూదందాల కోసం డిప్యూటీ సీఎం నారాయణస్వామి పంచన చేరి పెనుమూరు మండలంలో అవినీతి కార్యక్రమాలకు అడ్డాక నిలిచింది వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు. మండలంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి పేరు చెప్పి ఉద్యోగలు పేరిట ఎంతో మంది చేత డబ్బులు వసూలు దూది మోహన్ మహా సముద్రం కుటుంబాన్ని విమర్శిస్తే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గుంటిపల్లి సర్పంచ్ మునిరత్నం రెడ్డి, గుడ్యానంపల్లె సర్పంచ్ తులసమ్మ, కావూరి వారి పల్లె ఉప సర్పంచ్ చంగల్రాయ రెడ్డి,  నడిపి రెడ్డి, మాజీ సర్పంచ్ లు గోవింద రెడ్డి, సుబ్రహ్మణ్యం, సుధాకర్ రెడ్డి, మునికృష్ణ తదితరులు పాల్గొన్నారు.