ప్రజాశక్తి-పాలకొల్లు : టిడిపి నేతలు భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా పాలకొల్లులో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సిఎం జగన్ ను ఇష్టానుసారం తిట్టడంను ఎంఎల్సి కవురు శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. ఆయన పాలకొల్లు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మరలా ఆయన పాలకొల్లు వేస్తే తమ కార్యకర్తలు తగిన విధంగా సమాధానం చెబుతారని హెచ్చరించారు. గత ఎన్నికల్లో ఘన విజయం సాధించి తిరిగి భారీ మెజారిటీతో విజయం సాధించే జగన్ ను విమర్శిస్తే మాటలతో సమాధానం చెప్పమని హెచ్చరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో పేదరికం 18 నుంచి 6 శాతం కు తగ్గడం జగన్ చలువే అన్నారు. భవిష్యత్ కార్యక్రమం పేరుతో అధికార పక్షంపై విమర్శలు చేయడం తగదని చెప్పారు. ఎంఎల్ఏ నిమ్మల రామానాయుడు నియోజకవర్గంలో ఎన్ని చేష్టలు చేసిన పాలకొల్లులో వైసిపి విజయం ఖాయమని చెప్పారు. ఇంకా వైసిపి నేతలు గుణ్ణం నాగబాబు, డిటిడిసి బాబు మాట్లాడారు.










