Jan 20,2023 20:48

యువతే దేశ భవిష్యత్తు : మంత్రి రోజా
ప్రజాశక్తి- నగరి:
యువత శక్తికి ప్రతిరూపమని పర్యాటక, క్రీడలు, సాంస్కతిక మరియు యువజన అభివద్ధిశాఖ మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన ఫ్రెషర్స్‌ డే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సందర్భంగా మంత్రి రోజా మాట్లాడారు. నేడు ఇండియా, యంగ్‌ ఇండియాగా మారిందని, దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని తెలిపారు. యువత ఆత్మవిశ్వాసంతో జీవితగమ్యాన్ని సాధించడానికి నిరంతరం కషి చేయాలని కోరారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపక ఆకాంక్షలను నెరవేర్చి వారి కళ్ళల్లో సంతోషాన్ని చూడాలని సూచించారు. యువత అనుకుంటే చరిత్రలు సష్టిస్తారని, తలరాతలు మారిపోతాయాయని, ప్రభుత్వాలు కూలిపోతాయని, నిర్భయచట్టం రావడానికి యువతే కారణమని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడానికి కూడా యువత ఉద్యమాలే కారణమన్నారు. భవిష్యత్తుపై సరైన నిర్ణయాలు తీసుకునేది డిగ్రీ కళాశాల నుంచి మొదలవుతుందని తెలిపారు. నగరి నియోజకవర్గం, కళాశాల అభివద్ధికి తమ వంతు కషి చేస్తూనే ఉంటానని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వేణుగోపాల్‌ మాట్లాడుతూ కళాశాల విద్యలో అనేక మార్పులు వచ్చాయని కమ్యూనిటీ సర్వీసెస్‌ ప్రాజెక్టు లో ఇంటర్సిటీ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని తెలియజేశారు. నగరి మున్సిపల్‌ చైర్మన్‌ నీలమేఘం, వైస్‌చైర్మన్‌ బాలన్‌, ఎంపిపి భార్గవి భాస్కర్‌, వైస్‌ ఎంపీపీ కన్నెప్పన్‌, ఎంపీడీవో చంద్ర మౌళి, సీఐ శ్రీనివాసంతి పాల్గొన్నారు.