Oct 05,2023 19:28

ప్రారంభిస్తున్న ఎంఎల్‌ఎ

ప్రారంభిస్తున్న ఎంఎల్‌ఎ
యువత స్వయం కృషితో అభివృద్ధి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌:యువత స్వయంకషితో తమకు ఇష్టమైన వత్తిలో రాణిస్తే అభివద్ధిలోకి వస్తారని, అలాంటి వారికి ప్రభుత్వ ప్రోత్సహం ప్రజల సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్‌ రెడ్డి అన్నారు.ఆత్మకూరులోని ఎంజిఆర్‌ మున్సిపల్‌ బస్టాండ్‌ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్‌ లస్సీ సెంటర్‌ను ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌ రెడ్డి గురువారం ప్రారంభించి నిర్వాహకుడు అబ్థుల్‌ రజాక్‌ ను అభినందించారు.పట్టణంలో యువత ఇలా స్వయం ఉపాధి ద్వారా మరింత అభివద్దిలోకి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఈ లస్సీ సెంటర్‌ లో నాణ్యమైన వస్తువులను అందుబాటులో ధరలో ప్రజలకు అందించేలా ఉండాలని నిర్వాహకుడికి సూచించారు. ఆయన వెంట జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ గోపారం వెంకటరమణమ్మ , పట్టణ అధ్యక్షులు అల్లారెడ్డి ఆనంద్‌ రెడ్డి, జిసిఎస్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ చిల్లూరు ఆదిశేషయ్య , వైసిపి నాయకులు పాల్గొన్నారు.