ప్రజాశక్తి-అనంతపురం యువత నైపుణ్యాలను పెంచుకుంటేనే నేటి పోటీ ప్రపంచంలో రాణించే అవకాశం ఉందని జెఎన్‌టియు ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్‌వి.సత్యనారాయణ తెలిపారు. శనివారం స్థానిక కళాశాల ఆడిటోరియంలో ఇంటర్నల్ స్మార్ట్ ఇండియా హ్యేకథాన్, ఇంజినీరింగ్ కళాశాల స్కిల్ డెవలప్‌మెంట్ ఇంకుబేసిన్ సెంటర్ ఆధ్వర్యంలో వర్క్‌షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రిత్వ శాఖ, కేంద్రీయ మానవ వనరుల శాఖ, అఖిల భారత సాంకేతిక విద్యామండలి వారు ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ జరిగిన స్మార్ట్ ఇండియా హ్యేకథాన్ ఎంపికైన టీమ్‌ల ఆలోచనలు, ప్రాజెక్టులను స్మార్ట్ ఇండియా హ్యేకథాన్ వారికి పంపుతారన్నారు. వారు ఆమోదించిన ప్రాజెక్టు టీమ్‌లు, ప్రాజెక్టులను కార్యాచరణలో పెట్టి చెన్నైలోని బిఎస్ అబదూర్ రహిమాన్ క్రెసెంట్ ఇన్సటూట్‌లో జరిగే నమూన ప్రదర్శనలో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. సదస్సు కోఆర్డినేటర్ జి.మమత మాట్లాడుతూ కొత్త అవిష్కరణల కోసం విద్యార్థులు కృషి చేయాలన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించుకోవాలన్నారు. అనంతరం 30 ప్రాజెక్టు టీమ్‌లు వారి ఆలోచనలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఇ.అరుణకాంతి, ఎ.పి.శివకుమార్, ఎస్.చంద్రమోహన్‌రెడ్డి, ఎం.రామశేఖరరెడ్డి, బి.దిలీప్‌కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న జెఎన్‌టియు ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్‌వి










