ప్రజాశక్తి-బుక్కరాయసముద్రం టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు వస్తున్న ప్రజాధరణను చూసి వైసిపి ప్రభుత్వం వెన్నులో వణుకు పుడుతోందని నియోజకవర్గ ఇన్‌ఛార్జి బండారు శ్రావణిశ్రీ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని వాల్మీకి దేవాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కర్షక, కార్మిక, ముఖ్యంగా యువత సమస్యలు తెలుసుకునేందుకు లోకేష్ పాదయాత్ర చేపట్టారన్నారు. ఆయన పాదయాత్ర ఉమ్మడి అనంతపురం జిల్లాలోకి అడుగుపెట్టగానే పసుపు సునామీ వచ్చిందన్నారు. ప్రజలు కూడా తమ ఇంటి వ్యక్తి వస్తున్నట్లు ఆప్యాయంగా స్వాగతం పలుకుతున్నారన్నారు. అంతేగాకుండా లోకేష్ పాదయాత్రతో కార్యకర్తలో నూతనోత్సాహంతోపాటు ధైర్యం వస్తోందన్నారు. రానున్న ఎన్నికల్లో వైసిపి అరాచకానికి చరమగీతం పాడి శింగనమల నియోజకవర్గంలో ఖచ్చితంగా టిడిపి జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాగా ఈనెల 6వతేదీన గార్లదిన్నె మండలం కోటంక వద్ద నియోజకవర్గంలోకి పాదయాత్ర అడుగు పెట్టనున్నట్లు తెలిపారు. కావున నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పసుపుల హనుమంతురెడ్డి, పొడరాళ్ల రవీంద్ర, దండువారిపల్లి ఆదినారాయణ, జొన్నా రామయ్య, కెకె అగ్రహారం రాము, ఓబుళపతి, గోవిందరెడ్డి, ఎస్.నారాయణస్వామి, పిట్టు రామకృష్ణారెడ్డి, కొత్తపల్లి గంపన్న, కార్యకర్తలు పాల్గొన్నారు.
శింగనమల : మండలవ్యాప్తంగా టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తునా పాల్గొని నారా లోకేష్ పాదయాత్రను విజయవంతం చేయాలని నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి బండారు శ్రావణిశ్రీ పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలోని రామాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ లోకేష్ పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. భారీ ఎత్తున మహిళలు, ప్రజలు పాదయాత్రకు వచ్చి తమ సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకొస్తున్నారన్నారు. వారందరికీ లోకేష్ భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ గుత్తా ఆదినారాయణ, సీనియర్ నాయకుడు, లాయర్ ఈశ్వర్‌రెడ్డి, మాజీ మండల కన్వీనర్ చితంబరి దొర, చిదానందనాయుడు, బోయ సత్తి, మిట్ట పవన్, రాఘవరెడ్డి, మట్లగొంది సర్పంచి రమేష్, అట్టే రామాంజనేయులు, గుర్రం లక్ష్మీనారాయణ, అట్టే శ్రీనివాసులు, కొట్టాల సురేష్, నరసింహనాయుడు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
యువగళం బ్రోచర్లను విడుదల చేస్తున్న టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బండారు శ్రావణిశ్రీ, నాయకులు










