Aug 19,2023 00:54

యూటీఎఫ్‌ జిల్లా మధ్యంతర కౌన్సిల్‌ సమావేశాలను జయప్రదం చేయాలి
ప్రజాశక్తి-పలమనేరు: ఈనెల 20వ తేదీ పలమనేరు లయన్స్‌ క్లబ్‌లో జరగబోయే యూటీఎఫ్‌ జిల్లా మ ధ్యంతర కౌన్సిల్‌ సమావేశాలను జయప్రదం చేయా లని యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.వి. రమణ సభ్యులకు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక యూటీఎఫ్‌ డివిజన్‌ కార్యాలయంలో కౌన్సిల్‌ సమావేశాల ఆహ్వాన పత్రికను వారు ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా జి.వి.రమణ మాట్లాడుతూ యూటీఎఫ్‌ ఆవిర్భవించి 49 సం.లు గడిచింది. గత కౌన్సిల్‌ నాటినుండి నేటి వరకు అమలు జరిపిన కర్తవ్యాలను సమీక్షించుకొని, రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగంలో జరుగుతున్న తాజా పరిణామాల నేపథ్యంలో నూతన కర్తవ్యాలను రూపొందించుకోవ డానికి ఈ కౌన్సిల్‌ సమావేశాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర కౌన్సిలర్‌ సిపి ప్రకాష్‌ మాట్లాడుతూ ఈ సమావేశాలకు ముఖ్య అతిథులు గా పిడిఎఫ్‌ శాసనమండలి మాజీ ఫ్లోర్‌ లీడర్‌ విఠపు బాలసుబ్రమణ్యం, యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌. వెంకటేశ్వర్లు హాజరవుతున్నారని, కాబట్టి జిల్లా కాన్సి లర్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యదర్శులు, రాష్ట్ర కౌన్సిలర్లు, సీనియర్‌ నాయకులు పాల్గొని జయప్రదం చేయాలి అన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జి.కృష్ణమూర్తి, కోశాధికారి కె.ప్రసన్నకు మార్‌, సీనియర్‌ నాయకులు గురుమూర్తి, పురుషో త్తం, డివిజన్‌ కన్వీనర్‌ దయానంద, పిసి బాబు, బషీ ర్‌ అహ్మద్‌, కోదండరెడ్డి, శేఖర్‌, బాలాజీ పాల్గొన్నారు.