ప్రజాశక్తి - పాలకొల్లు
యునైటెడ్ కాపు క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన గాది ఆంజనేయులు యడ్లబజార్ సెంటర్లోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. సెక్రటరీగా పస్యావుల రవి, కోశాధికారిగా వినుకొండ శేషాద్రి బాధ్యతలు చేపట్టారు. వారిని ఉల్లంపర్రు మాంటిస్సోరీస్ కరస్పాండెంట్ మద్దాల వాసు, గవర్నర్ ముచ్చర్ల సంజరు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుత అధ్యక్షుడు పెనుమాక రామ్మోహన్, కార్యదర్శి జక్కంపూడి మదన్, కోశాధికారి కానూరి ప్రభాకర్, పోకల రాము పాల్గొన్నారు.










