Jun 21,2022 22:05

యోగాతో అనారోగ్య సమస్యలు దూరం
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:

యోగాతో అనారోగ్య సమస్యలు దూరమవుతాయని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఇండోర్‌ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవంను ఘనంగా జరుపుకున్నారు. జిల్లా యంత్రాంగం, నెహ్రూ యువ కేంద్ర చిత్తూరు, ఆయుష్‌ విభాగం మరియు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ చిత్తూరు సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో పివికెఎన్‌ కళాశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్‌ జి.ఆనంద్‌రెడ్డి, చిట్టిబాబు, నెహ్రూ యువ కేంద్ర చిత్తూరు జిల్లా యువజన అధికారి బి.ప్రదీప్‌ కుమార్‌, జిల్లా క్రీడాప్రాధికార సంస్థ చీఫ్‌కోచ్‌ ఏ.బాలాజీ పాల్గొన్నారు.
బంగారుపాల్యం: వ్యాయామంతోనే ఆరోగ్యమని ప్రధానోపాధ్యాయులు సుభాన్‌ అన్నారు. మంగళవారం మండలంలోని టేకుముంద జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వ్యాయామ ఉపాధ్యాయులు దేవేంద్ర ఆధ్వర్యంలో జరిగింది. ఉపాధ్యాయులు షంషేర్‌ఖాన్‌, వెంకటస్వామి, జయప్రకాష్‌ పాల్గొన్నారు.
గుడిపల్లి: కుప్పం లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో మంగళవారం నాడు కుప్పం ఎన్టీఆర్‌ క్రీడామైదానంలో అంతర్జాతీయ యోగాదినోత్సవం నిర్వహించారు. మాస్టర్లు గోపి, గణేష్‌ ఆధ్వర్యంలో యువతకు అవగాహన కల్పించారు. లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షులు డాక్టర్‌ ఏ.మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఆర్‌పురం: స్థానిక ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రంలో మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎంఎల్‌హెచ్‌పి ఆధ్వర్యంలో కవిత నిర్వహించారు.
వెదురుకుప్పుం: స్థానిక వైఎస్‌ఆర్‌ డిగ్రీ కళాశాలో యోగా గురువు బి.కుమార్‌ రాజు ఆధ్వర్యంలో విద్యార్థులకు యోగాపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ అన్నపూర్ణ శారద, విద్యార్థులు పాల్గొన్నారు.
నగరి: స్థానిక ప్రభుత్వ కళాశాలలో ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వేణుగోపాల్‌ విద్యార్థులతో యోగాసనాలు వేయించారు. అనంతరం వారికి యోగాపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ సుబ్రహ్మణ్యం, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారి డాక్టర గోపి, అకడమిక్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ భాస్కర్‌ రాజు, తదితరులు పాల్గొన్నారు.
కార్వేటినగరం: యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం మధ్యాహ్నం వద్ధాశ్రమంలో వద్ధులకు ఇండియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ టి.మనోజ్‌ అన్నదానం నిర్వహించారు. దీంతోపాటు స్వీట్లు,పండ్లు పంపిణీ చేశారు. అనంతరం యోగా ప్రాముఖ్యత వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో ఇండియన్‌ బ్యాంకు సిబ్బంది, పర్యవేక్షకులు ప్రకాష్‌, పలువురు పాల్గొన్నారు.
బైరెడ్డిపల్లి: కేంద్రంలోని కళాతరంగిణి వ్యవస్థాపకులు రాజేష్‌బాబు అంతర్జాతీయ యోగదినోత్సవం సందర్భంగా విద్యార్థులచే యోగాసనాల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు.