భోజనం ప్యాకెట్లు పంపిణీ చేస్తున్న దృశ్యం
ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు డివిజన్ జీవనజ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక శ్రీ స్కందపురి సోమేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద ఉన్న యాచకులకు శనివారం భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. సేవాసమితి కార్యదర్శి శీలం వెంకటేష్ మాట్లాడుతూ జంగాల వెంకటరత్నమ్మ జ్ఞాపకార్థం కుమారుడు జంగాల రవి కోటి యాచకులకు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. అధ్యక్షుడు చనమాల శ్రీనివాసరావు, నితీష్ పాల్గొన్నారు.










