Jun 16,2023 14:56
  • నిర్వహించిన మాజీ మంత్రి రఘువీరారెడ్డి కుటుంబ సభ్యులు

ప్రజాశక్తి-మడకశిర రూరల్ : మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలోని శుక్రవారం టీటీడీ సహకారంతో దేవస్థానముల కళ్యాణ మండపం నిర్మాణానికి మాజీ మంత్రి రాఘవేంద్ర రెడ్డి కుటుంబ సభ్యులు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా రఘవీరారెడ్డి అన్న చెలువ మూర్తి కళ్యాణ మండపం నిర్మాణానికి కోటి రూపాయలు విరాళం అందజేశారు. మాజీ మంత్రి రఘువీరారెడ్డి మాట్లాడుతూ అందరి సహకారంతో కళ్యాణ మండపం నిర్మాణానికి పూర్తి చేయించి గ్రామీణ ప్రజలకు కళ్యాణ మండపం సౌకర్యం కల్పిస్తామన్నారు. ఈ కళ్యాణ మండపం నిర్మాణానికి దాదాపు 6 కోట్ల వరకు నిధులు విచ్చిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలోటీటీడీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దివాకర్ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ కాంట్రాక్టర్ రంగనాథ్ గ్రామస్తులు పాల్గొన్నారు.