ప్రజాశక్తి-చిత్తూరు : చిత్తూరు జిల్లాలోని జ్యూస్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఒక కార్మికుడు కరెంట్ షాక్ తో మృతి చెందాడు. కరెంట్ షాక్ కు గురైన వ్యక్తిని యాజమాన్యం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించింది. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు ఐరాల మండలం, చింత గుబ్బలపల్లి గ్రామానికి చెందిన భరత్ గా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.










