- ఐద్వా జిల్లా కన్వీనర్ భువనేశ్వరి
ప్రజాశక్తి-వి కోట : మహిళలపై జరుగుతున్న అకృత్యాలు అరికట్టి అత్యాచారాలు నివారించే లక్ష్యంతో చేపట్టిన మహిళల పోరుయాత్ర జాతను విజయవంతం చేయాలని ఐద్వా జిల్లా కన్వీనర్ భువనేశ్వరి పిలుపునిచ్చారు. మహిళల పోరు యాత్ర జాతాను ఈనెల 28 నుండి ఆగస్టు 8 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను వీకోటలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ హింస లేని సమాజం కోసం జరుగుతున్న రాష్ట్ర యాత్రలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మహిళలకు చిన్నారులకు రక్షణ కల్పించే చట్టాలను కఠిన తరం చేయాలని వారి సందర్భంగా డిమాండ్ చేసారు. వీటితోపాటు అత్యాచారాలకు పాల్పడే నిందితులను పాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా త్వరితగతిన విచారించి కఠినశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. స్త్రీల పట్ల హింస అస్లీలత అసమానతులను ప్రేరేపించే చలనచిత్రాలను, టీవీ సీరియల్ తో పాటు ఇంటర్నెట్లపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. మద్యం, మత్తు పదార్థాల విక్రయాలపై కఠిన ఆంక్షలు విధించాలన్నారు. మహిళలకు విద్య ఉపాధి అవకాశాలు మెరుగుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని వారి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ లక్ష్యంతో చేపట్టిన యాత్రను జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అయిద్వ జిల్లా కో కన్వీనర్ జీవిత సిఐటియు మండల కార్యదర్శి అనిత, అంగన్వాడీ ప్రాజెక్ట్ కార్యదర్శి శ్యామల, పంచాయతీ కార్యదర్శి ఉదయ్ తో పాటు సంఘ సభ్యులు పాల్గొన్నారు.










