Mar 16,2023 16:07

ప్రజాశక్తి - పెనుమంట్ర : మార్టేరు  వ్యవసాయ పాలిటెక్నిక్ విధ్యార్ధులు ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన “ఇంటర్ పాలిటెక్నిక్ స్పొర్ట్స్, గేమ్స్, కల్చరల్ అండ్ లిటరరీ మీట్-2023’ లో ఉత్తమ ప్రతిభ కనపరచి ఓవరాల్ చాంపియన్ షిప్ ను సాధించారు. ఈ సందర్భంగా సంస్థ  ఎడిఆర్ , ప్రిన్సిపాల్ డాక్టర్ టి శ్రీనివాస్ అద్యక్షతన గురువారం అభినందన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ  ఆచార్య ఎన్ జి  రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన శ్రీకాకులం జిల్లాలో వ్యవసాయ కళాశాలలో ఈ నెల ఒకటి నుండి నాలుగవ తేదీ వరకూ యూనివర్సిటీకి చెందిన 21 వ్యవసాయ పాలిటెక్నిక్ లకు చెందిన 420 మండి విధ్యార్ధులు ఈ పోటీలలో పాల్గొన్నారని తెలిపారు .ఈ పోటీలో  శ్రీకాకులం జిల్లా, నైరా వ్యవసాయ కళాశాలో జరిగిన క్రీడా, సాంస్కృతిక పోటీలలో విజయం సాధించి ఓవరాల్ చాంపియన్ షిప్ ను సాధించడం అభినందనీయమన్నారు . ఈ సందర్భంగా డాక్టర్ టి శ్రీనివాస్ విజేతలైన విధ్యార్ధులను అభినందిస్తూ, చదువుతో పాటుగా క్రీడలలో కూడా రాణిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశించారు. అలాగే ఈ క్రీడా సాంస్కృతిక పోటీలలో పాల్గొన్న విధ్యార్ధుల వెన్నంటి ఉండి ఈ విజయానికి కారకులైన ఫిజికల్ డైరెక్టర్  కె శ్రీనివాస రెడ్డి , స్టూడెంట్స్ ఆక్టివిటీస్ ఇంచార్జ్  సి హెచ్ గణపతి లకు ప్రత్యేక అభినందలు తెలిపారు. క్రీడా పోటీలలో పాల్గొన్న విద్యార్ధులు తమ అనుభవాలను తెలియజేశారు. అనంతరం  గుర్తింపు తీసుకువచ్చిన విధ్యార్ధులను వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కెఎం దక్షిణామూర్తి, అకడమిక్ వ్యవహారాల ఇంచార్జ్ డాక్టర్ వై సతీష్, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు, వ్యవసాయ పాలిటెక్నిక్ బోధనా బోధనేతర సిబ్బంది అభినందించారు.