ప్రజాశక్తి-వెదురుకుప్పం(చిత్తూరు జిల్లా) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా గిడుగు రుద్రరాజు నియామకం పట్ల పీసీసీ మెంబర్ పోటుగారి భాస్కర్ గురువారం హర్షం వ్యక్తం చేసారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... రుద్రరాజు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని క్షేత్ర స్థాయి నుండి బలోపేతం చేస్తామని పోటుగారి భాస్కర్ అన్నారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని, 2024 లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా రుద్రరాజు నాయకత్వంలో తామంతా సైనికుల వలె పని చేస్తామని చెప్పారు. హర్షం వ్యక్తం చేసిన వారిలో డీసీసీ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, ఓబీసీ నాయకులు సుబ్బారాయులు, ఓబీసీ మాజీ ఉపాధ్యక్షులు బుల్లెట్ రవి, డీసీసీ ఉపాధ్యక్షులు డి. కన్నన్, వెదురుకుప్పం మండల కాంగ్రెస్ అధ్యక్షులు కందుకూరి హుమేష్, జీడీ నెల్లూరు మండల అధ్యక్షులు చంద్రబాబు, పెనుమూరు మండల అధ్యక్షులు నరసింహులు నాయుడు, కార్వేటినగరం మండల అధ్యక్షులు దినకర్ ప్రసాద్, పాలసముద్రం మండల అధ్యక్షులు పుష్పరాజ్, నాయకులు, దాసురెడ్డి, జయచంద్ర, వెంకటేష్ తదితరులు వున్నారు.










