May 11,2023 13:02

ప్రజాశక్తి - పెనుమంట్ర : పొలమురులో డివైఎఫ్ఐ, ఐద్వా సహకారంతో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఏడవవ రోజు గురువారం వేసవి వినోదంలో భాగంగా రాష్ట్ర స్థాయి మెజీషియన్ గోపాల్ రెడ్డి మ్యాజిక్ షో నిర్వహించారు. ఈ షో ద్వారా పిల్లల మనసులో ఉన్న మాథ్స్, ఫిజిక్స్ వంటి కటిన సబ్జెక్టుల పట్ల ఉన్న భయాలను తొలగించి ఆసక్తిని కలిగించారు. పిల్లలకి ఓజోన్ పొర అవశ్యకతను మేజిక్ ద్వారా వివరించారు. పిల్లలో దేశభక్తిని రేకత్తించే విధంగా జాతీయ జండాపై మ్యాజిక్ చేసి నినాదాలు చెప్పించారు. అనంతరం ఐద్వా జిల్లా అధ్యక్షులు కేతా పద్మజ  పిల్లలకు నీతి కథలు చెప్పి అలాగే దేశభక్తి గీతాలు పాడి పిల్లల్ని అలరించారు. చింతపల్లి మావో పిల్లలకు మూఢాచారాలు మూఢనమ్మకాలపై ఒక పాట నేర్పి అవగాహన కల్పించారు. జాతీయ వైజ్ఞానిక దినోత్సవం సందర్భంగా మన దేశ వైజ్ఞానిక వేత్తల గురించి పిల్లలకు అవగాహన కల్పించారు. బాలల సంఘం పిల్లలు రాష్ట్ర స్థాయి మెజీషియన్ గోపాల్ రెడ్డికు సాలువ కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు భారతి, భారత్, ప్రమోద్, బాలల సంఘం నాయకులు అలాగే సుమారు 60 మంది పాల్గొన్నారు.