Apr 27,2023 16:49

ప్రజాశక్తి-ఆత్మకూరు : ఆత్మకూరు మండల కేంద్రంలో ఐద్వా మహిళా సంఘం ఆధ్వర్యంలో కళాకర్ల జిల్లా కార్యదర్శి ఉరుముల సోమశేఖర్ కూతురు ఉరుముల అనూష రాణి ఆర్ డి టి సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా చదివించడంతో శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ సెకండియర్ మంచి మార్కులతో పాటు పాస్ కావడం జరిగింది 1000 గాను 972 మార్కులు సాధించడం జరిగింది. ఐద్వా కమిటీ సభ్యురాలు సావిత్రమ్మ అత్యధిక మార్కుల సాధించినందుకు సోమశేఖర్ కూతురు అభినందించడం జరిగింది. ఆమె మాట్లాడుతూ ఇంకా ముందు ముందుకు వెళ్లి మంచి మార్గం సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని తల్లిదండ్రులకు మంచి కీర్తిని సాధించాలని అనుషరానికి శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యం కు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సిపి ఎం మండల కార్యదర్శి శివ శంకర్, ఎన్ పి ఆర్ డి జిల్లా కార్యదర్శి రామయ్య, సిఐటియు జిల్లా కమిటీ సభ్యురాలు జయమ్మ, ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి  కృష్ణవేణి, వెంకటమ్మ, సరస్వతమ్మ, టిడిపి మండల నాయకుడు ఉరుముల ఓబులేసు, తదితరులు పాల్గొన్నారు.