Dec 24,2022 16:56

 ప్రజాశక్తి-రొంపిచెర్ల: పదోన్నతి, బదిలీపై వెళ్తున్న ఇద్దరు ఐసిడిఎస్ సూపర్వైజర్ లను అంగన్వాడి టీచర్లు రొంపిచెర్లలో శనివారం ఘనంగా సన్మానించారు. రొంపిచర్ల క్రాస్ అంగన్వాడి టీచర్ గా పనిచేస్తున్న సుహాసిని గ్రేడ్-2 ఐసిడిఎస్ సూపర్వైజర్ గా ఎంపికయ్యారు. దీనితో ఆమెను తిరుపతి జిల్లాలోని చంద్రగిరి ఐసిడిఎస్ ప్రాజెక్టుకు సూపర్వైజర్ గా బదిలీ చేశారు. అలాగే ఇక్కడ పనిచేస్తున్న ఉమా ను అన్నమయ్య జిల్లాలోని పీలేరు మండలానికి బదిలీ చేశారు. దీనితో ఇద్దరు సూపర్వైజర్ లను అంగన్వాడి టీచర్లు పూలమాలవేసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చిన్నకొట్టిగల్లు సిడిపిఓ రాజమ్మ మాట్లాడుతూ సుహాసిని తన 15 సంవత్సరాల కాలంలో ఎలాంటి మచ్చ లేకుండా పనిచేశారని తెలిపారు. కష్టపడి పని చేస్తే ప్రతి ఒక్కరికి ఫలితం ఉంటుందన్నారు. విధి నిర్వహణలో పదోన్నతులు, బదిలీలు ఉద్యోగులకు సహజమేనన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ భారతి, అంగన్వాడి టీచర్లు అలివేలు, లావణ్య, సంపత్ కుమారి,లక్ష్మీదేవి, షాహినా, గౌరీ,లలిత, లక్ష్మి, రమణమ్మ,జయమ్మ, తదితరులు పాల్గొన్నారు.