May 08,2023 15:52

ప్రజాశక్తి-కాళ్ల : సంఘ సేవకుడు, దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు దాట్ల వెంకట రామరాజుకు డాక్టరేట్ లభించడం అభినందనీయమని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ బహుజన సమైక్య వ్యవస్థాపకులు సోడదాసి గంగయ్య అన్నారు. సోమవారం కాళ్లకూరు గ్రామంలో డాక్టరేట్ దాట్ల వెంకట్రామరాజుకు సత్కార సభ  నిర్వహించారు. కాళ్లకూరు గ్రామానికి దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ అధినేత దాట్ల వెంకట్రామరాజుకి బెంగుళూరు కు చెందిన ఆసియా వేదిక్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ ఇటీవల డాక్టరేట్ ను అందుకున్నారు.ట్రస్టు ద్వారా పేద ప్రజలకు, పేద విద్యార్థులకు ఆర్థిక సహకారం, ప్రతి వేసవి చలివేంద్రం, మోక్షధామం వివిధ అభివృద్ధి, వివిధ స్వచ్ఛంద సేవలు చేసినందుకు ఈ డాక్టరేట్ వరించింది.  ఈ సందర్భంగా
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ,బహుజన సమైక్య సభ్యులు, వివిధ సంఘాల సభ్యులు దాట్ల వెంకట్రామరాజును ఘనంగా సన్మానించారు. దాట్ల వెంకట్రామరాజు కాళ్లకూరు గ్రామంతో వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని పలు వక్తలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గుడే సే అనిల్ కుమార్, కాళ్ల మండల అదుక్షులు కొనా రంజీత్, పాస్టర్ అహరోను, గాతలసందీప్, తాళ్లూరి రాజ్ కుమార్,గొల్ల ఆశీర్వాదం, పారువుడి యోహాను, బుంగా దానియేలు, ఈద భోగేష్, జి. రాజేష్, చిలీ కాసులు,తదితరులు పాల్గొన్నారు.