ప్రజాశక్తి-గణపవరం : పదో తరగతి పరీక్ష ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన శ్రీ చైతన్య సిబిఎస్ ఈ పాఠశాల విద్యార్థులను శనివారం ఉంగుటూరు శాసనసభ్యులు పుప్పాల శ్రీనివాసరావు బ్రాకెట్లో వాసుబాబు అభినందించారు. స్థానిక పాఠశాలలో విద్యార్థులకు అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వాసుబాబు విద్యార్థుల అభివృద్ధికి సీబీఎస్ఈ పాఠశాల ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని అభినందించారు. పాఠశాల ప్రిన్సిపాల్ పి రాంప్రకాష్ మాట్లాడుతూ పాఠశాల ప్రథమ స్థానంలో సిహెచ్ నవీ శ్రీ 500కి 469 ద్వితీయ స్థానం 500కి 400 మూడో స్థానం ఈ హాసిని 500కి 426 నాలుగో స్థానం ఏ కీర్తన 500కి 425 ఐదో స్థానం 500కి 413 సాధించి పాఠశాలలో ప్రథమ స్థానంలో గెలిచారని చెప్పారు. పాఠశాలలో విద్యార్థులు అందరూ నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని చెప్పారు. విద్యార్థులను పాఠశాల ఏజీఎం వై ఎన్ శ్రీనివాసు రీజియన్ ఇన్చార్జి ఎం పార్థసారథి, ఏ రామారావు, పదో తరగతి ఇంచార్జ్ రామకృష్ణ తల్లిదండ్రులు అభినందించారు.










