ప్రజాశక్తి-చిత్తూరు : మూడు రోజుల నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. చలి గజగజ వణికిస్తోంది. ఉదయం 9 దాటినా చలి తగ్గడం లేదు. చిన్నారులు, వృద్ధులు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. తిరుమలలో ఈరోజు ఉదయం 6 గంటలకు 12 డిగ్రీలు, తిరుపతిలో 16, చిత్తూరులో 15, మదనపల్లెలో 13 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆంధ్రా ఊటి హార్సిలీహిల్స్లో 10 డిగ్రీలు ఉంది.










