పెనుకొండ అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేస్తాం, చర్చకు ఎప్పుడైనా రండి : ఎమ్మెల్యే
ప్రజాశక్తి -పెనుకొండ : టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర కాదని, సెల్ఫీ యాత్ర అని మాజీ మంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ పేర్కొన్నారు. శుక్రవారం పెనుకొండ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యలపై అవగాహన లేకుండా లోకేష్ పాదయాత్ర జరుగుతోందన్నారు.లోకేష్ ఇష్టానుసారంగా మా ముఖ్యమంత్రిపై మాట్లాడితే రాయలసీమ దాటే లోపల పరకలతో ప్రజలు కొడతారన్నారు.కియా వద్ద జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వీడియోని రిలీజ్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. వైయస్సార్ పార్టీ పారిశ్రామిక అభివృద్ధికి ఎప్పుడూ అవరోధం కాదని, రిజర్వాయర్ వద్ద ఉన్న భూములను మాత్రమే వెనక్కి ఇప్పిస్తామని చెప్పారన్నారు. పెనుకొండ అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేస్తాం, చర్చకు ఎప్పుడైనా రండి అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పెనుకొండ జడ్పీటీసీ శ్రీరాములు, రొద్దం ఎంపీపీ చంద్రశేఖర్, నాయకులు జయశంకర్ రెడ్డి, మండల కన్వీనర్ నాగలూరు బాబు, కొండలరాయుడు, వెంకటరామిరెడ్డి,వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.










