Jun 05,2023 16:16
  • ఎమ్మెల్యే వెంకటే గౌడ

ప్రజాశక్తి-వి.కోట: రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతి గడపకు అందించడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకుని  అమలు చేస్తున్నారని పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ తెలిపారు. మండల పరిధిలోని కొంగాట పంచాయతీ కొంగాటం సచివాలయ పరిధిలో సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కొంగాటం, పిచ్చి గుండ్లపల్లి, కొండేపల్లి, కారకుంట, కొత్తూరు, మందలకుంట గ్రామాల్లో ప్రతి గడపను వారు. సందర్శించారు. ఈ సందర్భంగా గడచిన నాలుగు సంవత్సరాలలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు. 70 కోట్ల రూపాయలు పైగా వేయంతో నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు, మురుగునీటి కాలవలు నిర్మించామని గ్రామాల్లో త్రాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించామన్నారు. గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అందించగలిగాం కాబట్టి ధైర్యంగా వారి గడపకు  వెల్లగలుగుతున్నామన్నారు. ప్రతి గడప వద్ద తమకు ఆత్మీయ స్వాగతం ఘనంగా లభిస్తోందని వారు తెలిపారు. నియోజకవర్గంలో వైసిపి ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు నూరు శాతం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రాబోవు కాలంలో మరింత మెరుగైన పాలన అందించేందుకు పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అనిత జయరామిరెడ్డి ఎంపీపీ యువరాజ్ మండల పార్టీ కన్వీనర్ బాల గురునాథ్ మాజీ రెస్కో చైర్మన్ ఆర్ హెచ్ జయరామిరెడ్డి ఎంపీటీసీ సభ్యులు కమల్, సమద్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.