May 20,2023 14:50

ప్రజాశక్తి-ఆత్మకూరు : ఆత్మకూరు మండల పరిధిలో వేపచెర్ల గ్రామంలో త్రాగునీటి కోసం గ్రామప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గ్రామపంచాయతీ ట్యాంక్ నుంచి సరిపడే నీరు అందడం లేదు. సత్యసాయి వాటర్ కూడా రావడం లేదు. పంచాయతీ అధికారులు పట్టి పట్టినట్లు ఉన్నారని  త్రాగునీటి కోసం బిందెలు తీసుకొని వ్యవసాయ పొలాల్లోకి పోయి నీటిని తీసుకొచ్చే పరిస్థితి నెలకొంది. అధికారులు స్థానిక శాసనసభ్యులు నీటి సమస్యని పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరుచున్నాను. ఇప్పటికైనా జిల్లా ఉన్నంత అధికారులు ఎమ్మెల్యే స్పందించి నీళ్లు సరఫరా చేసేలా చూడాలని గ్రామ ప్రజలు కోరుచున్నారు.