ప్రజాశక్తి-బొమ్మనహల్ : మండలంలోని ఉద్యహాల్ గ్రామంలో చెందిన హరిజన హులిగెమ్మ 68 సంవత్సరాలు ఆమెకు గతంలో పెన్షన్ వచ్చేది ప్రస్తుతం వాలంటీర్లు ఆన్లైన్లో పెన్షన్ రద్దు చేశారని ఆమె గురువారం ఎంపీడీవో కార్యాలయం గేటు వద్ద అధికారుల కోసం పడిగాపులు కాసింది నాకు ఎవరూ లేరు నేను ఒంటరి మహిళని కొడుకులు కోడళ్ళు ఎవరూ చూడగా ఒంటరిగా నా సొంత ఇంటిలో ఉన్నానని వచ్చే పెన్షన్ పైన ఆధారపడి జీవించే దాన్ని ఆ పెన్షన్ సైతం ప్రభుత్వం రద్దు చేయడం వల్ల నేను బజారున పడి అడుక్కుతినవలసిన దుస్థితి వచ్చిందని ఆమె కన్నీరు పెట్టారు. దళిత మహిళని వృద్ధురాలని అయినా చూడకుండా ఆన్లైన్లో పెన్షన్ రద్దు చేయడం ఇది ఎక్కడి న్యాయం అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వృద్ధులైన వారికి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలని వారి ఆరోగ్య పరిష పరిరక్షణ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇస్తుంటే స్థానిక నాయకులు గ్రామాల్లో ఒకరిపై ఒకరు ఉన్న విభేదాలను దృష్టిలో ఉంచుకొని దళితుల పెన్షన్లు తొలగించడం ఎంతవరకు ధర్మము అని ఆమె కోరారు. ఎంపీడీవో కి వివరణ కోరగా ఆమె దరఖాస్తు చేశారు. పూర్తి వివరాలు సేకరిస్తామని ఎంపీడీవో షకీలా దాటవేశారు.










