ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం రూరల్ : మాధవరంలో ఉపాధి హామీని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా ఉపాధ్యక్షులు కండెల్లి సోమరాజు దుయ్యబట్టారు. ఉపాధి పర్యటనలో భాగంగా ఈరోజు తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామంలో ఉపాధి పని ప్రదేశాల్లో ఆయన పర్యటన చేసి కూలీలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మాధవరంలో గత ఐదు వారాల నుండి పనిచేస్తున్న ఇప్పటికీ ఒక్క వారం డబ్బులు కూడా పడలేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తూ తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. అలాగే రెండు పూటలా పని విధానంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నామని కూలీలు తెలిపారు. 2005 ముందు వాము పక్ష పార్టీలు పోరాటంతో యూపీఏ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అంతకంతకు నిధులు పెంచకపోగా నిధులు తగ్గిస్తూ పొమ్మనకుండా పొగ పెట్టి కూలీలు తమంతట తామే ఈ పనికి దూరమయ్యేలా చేసి అనంతరం ఈ పథకాన్ని పూర్తిగా తీసివేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకున్నదని ఆయన ఎద్దేవా చేశారు. వ్యవసాయంలో యంత్రాలు పెరగడంతో కూలీలు ఉపాధి పోయిందని ఉన్న ఉపాధి అల్లా ఉపాధి పథకమేనని దీనిని నిర్వీర్యం చేయటం కేంద్ర ప్రభుత్వానికి తగదని అట్లా నిర్వీర్యం చేయడానికి చూస్తే కూలీలు చూస్తూ ఊరుకోరని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఊరూరా ఉద్యమించి పథకాన్ని నిలబెట్టుకోవడానికి సమరసిల పోరాటాలు కూడా సిద్ధపడతారని ఆయన హెచ్చరించారు. తక్షణమే మండలంలో పనిచేస్తున్న ఉపాధి కూలీలకు అందరికీ వేతన బకాయిలు ఇవ్వాలని అడిగిన ప్రతివారికి ఉపాధి పనులు కల్పించాలని అన్ని గ్రామాలలో ఉపాధి పనులు తక్షణమే చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాలింగి లక్ష్మి మంద రామారావు మామిడిపల్లి స్వర్ణ , పెనుమాక సుబ్బమ్మ, కొల్లి లక్ష్మి, ఏలూరి కనకరాజు, ఖండిల్లి నాగేశ్వరరావు, పెనుమాక సంసోను, తానేటి వెంకటరావు, కొడవటి పద్మ ఆకుమర్తి చిన్ని, పొడవటి వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.










