- వీఆర్వో మరణం తాసిల్దార్లు సంతాపం
ప్రజాశక్తి బైరెడ్డిపల్లి : పలమనేరు టు కుప్పం జాతీయ రహదారిలోని దేవదొడ్డి గ్రామం సమీపంలో కుప్పం వైపు వెళ్తున్న కారు ముందర టైరు బరస్ట్ కావడంతో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహన పైకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి వివరాలు వీకోట మండలంలో వీఆర్వో గా పని చేస్తూ ఓ వివాహానికి హాజరై స్వగ్రామమైన లక్కనపల్లికి ద్విచక్ర వాహనంలోవస్తుండగా విఆర్ఓ శంకర్ స్వామి కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతనికి ఒక భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇతని మరణం వల్ల కుటుంబ సభ్యులు అనాధలుగా మిగిలారు. విధి నిర్వహణలో వస్తున్న విఆర్ఓ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని వారి కుటుంబ సభ్యులకు ఒక ఉద్యోగం ఇప్పించాలని స్థానికులు కోరుతున్నారు. స్థానికుల ద్వారా తెలుసుకున్న ఎస్సై వెంకట నరసింహులు తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని కారులో ప్రయాణిస్తున్న వారిని విచారించగా ప్రమాదవశాత్తు కారు ముందర టైర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగిందని వారు తెలిపారు. కేసు నమోదు చేసి మృతి చెందిన వీఆర్వో శంకర్ స్వామి పోస్ట్మార్టం నిమిత్తం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం సంఘటనకు కారణాలు ఇంకను తెలియాల్సి ఉంది. వి వీకోట తాసిల్దార్ సీతారాం బైరెడ్డిపల్లి తాసిల్దార్ కుమారస్వామి విఆర్ఓ శంకర్ స్వామి దుర్మరణంపై చాలా దారుణమని విధి నిర్వహణలో ప్రజలు సమస్యను తన సమస్యగా భావిస్తూ విధులు నిర్వహించే వాళ్ళని ఇతను మృతి చెందడం చాలా బాధాకరమని వారి శాంతించాలని శోక సంతాపముగా తెలియజేశారు.










