- సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు
ప్రజాశక్తి - గంగాధర నెల్లూరు : చిత్తూరు-తచ్చూరు నేషనల్ హైవేలో భూములు కోల్పోయి రైతులకు ఇవ్వాల్సిన నష్ట పరిహారం ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు మీనవేషాలు వేయడం సరైనది కాదని ఆదివారం గంగాధర నెల్లూరు మండలంలో జరుగుతున్న రోడ్డు పనులను సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు తచ్చూరు నేషనల్ హైవే పరిధిలో జిల్లాలో 8 మండలాల్లో భూములు సేకరణ చేశారని అయితే 2013 భూ సేకరణ చట్ట ప్రకారం రైతులకు నష్టపరహారం చెల్లించడంలో అధికారుల నిర్లక్ష్యం వహించారని అన్నారు. కొంతమందికి అరకొర చెల్లించినప్పటికీ ఇంకా అనేకమందికి నష్టపరిహారం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రైతులు ఆఫీసులు చుట్టూ తిరుగుతున్న అధికారులు ఏమాత్రం పట్టించుకున్న పరిస్థితి లేదన్నారు. ఇక్కడికి అక్కడికి వెళ్ళండి అని తిప్పించుకుంటున్నారు. తప్ప రైతులకు నష్టపరిహారం మాత్రం రావడం లేదన్నారు. ఈ హైవేకి సంబంధించి సమాచారం కోసం నేషనల్ హైవే ఆఫీసులో అడిగిన అక్కడ ఉన్న సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బిఎన్.రెడ్డి కాలనీలో ఉన్న ఆఫీస్ లో మాత్రం అధికారులు ఎప్పుడూ అందుబాటులో ఉండరు. ఆర్డీవో గారు చెప్పిన సమాచారం ఇవ్వకుండా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ఉన్నతాధికారులు సమావేశాలు పెట్టిన సందర్భంగా చెప్తున్న తర్వాత పట్టించుకున్న పరిస్థితి లేదని ఆరోపించారు. ఇప్పటికైనా నేషనల్ హైవేలో భూములు కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని లేనిపక్షంలో రైతులతో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.










