Aug 30,2022 14:40
  • హాజరైన జిల్లా జడ్పీ చైర్మన్ ఎంపీపీ

ప్రజాశక్తి బైరెడ్డిపల్లి : స్థానిక మండల కేంద్రంలో వెలసి ఉన్న శ్రీ వీరభద్ర స్వామి దేవాలయము నందు స్వామివారికి రుద్రాభిషేకము, కలశారాధన  , గణపతి హోమం, నవగ్రహ హోమం, రుద్ర హోమం, దుర్గా హోమం, అఘోర పాశుపత హోమం, జయాది హోమం, స్వామివారికి అర్చకులచే ఈ కార్యక్రమాలు జరిపించారు. ఈ కార్యక్రమంలో దేవుని దర్శించేందుకు జిల్లా జడ్పిటిసి చైర్మన్ శ్రీనివాసులు అలియాస్ వాసు. స్థానిక ఎంపీపీ మొగసాల రెడ్డప్ప హాజరయ్యారు వీరికి అర్చకులచే కండువా కప్పి పూలమాలవేసి తీర్థప్రసాదాలు అందజేసి వారిని వేదమంత్రాలతో జడ్పిటిసిని ఎంపీటీసీనీ ఆశీర్వదించడం జరిగింది. చుట్టుపక్కల గ్రామ ప్రజలు స్వామి వద్దకు చేరుకొని పూజలు నిర్వహించి స్వామి ఆశీర్వాదం పొందారు. అర్చకులు అందరికీ తీర్థప్రసాదాలు అందజేశారు.