కార్మిక, కళా పాత్రికేయ రంగాల్లో విన్నకోట వెంకటేశ్వరరావు చేసిన సేవలు భేష్..
ప్రజాశక్తి-పాలకొల్లు : పాలకొల్లు ప్రెస్ క్లబ్, ఎపియుడబ్లుజె జిల్లా అధ్యక్షుడుగా,నంది అవార్డు గ్రహీతగా, రాష్ట్ర శ్రమశక్తి అవార్డు గ్రహీతగా విన్నకోట వెంకటేశ్వరరావు సమాజానికి చేసిన సేవలు వర్ణణాతీతం అని ఎపియుడబ్లుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందూ జనార్దన్, ఐజెయు సభ్యులు డి సోమసుందర్ చెప్పారు. పాలకొల్లులో విన్నకోట సంస్మరణ సభలో వారు మాట్లాడారు. కార్మిక, పాత్రికేయ, కళారంగానికి చేసిన సేవలను సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజా రామ్మోహన్ రాయ్,పట్టణ కార్యదర్శి జవ్వాది శ్రీనివాస్ ,ఏఐటియుసి రాష్ట్ర ఉఫాధ్యక్షులు నెక్కంటి సుబ్బారావు, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శివ, జిల్లా ఉపాధ్యక్షుడు పిటి వెంకటేశ్వరరావు కొనియాడారు. ఇంకా సంతాప సభలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్యే డా. బాబ్జి, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మచిలీపట్నం సిఐ కే శివాజీ, పలు కార్మిక ,కళా, పాత్రికేయ ప్రముఖులు, వివిధ పార్టీల నేతలు, ఛాంబర్స్ సభ్యులు ఆయన సేవలను కొనియాడారు. ఆయన కుమారుడు వెంకటరమణకు సానుభూతి వ్యక్తం చేశారు










