Jun 16,2023 16:03
  • జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ నాగరత్నమ్మ, సర్పంచ్ సుప్రియ 

ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బిసి గురుకుల పాఠశాలలో 4వ విడత విద్యా కానుక పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నార్పల గ్రామ పంచాయితీ సర్పంచ్ మన్నీల సుప్రియ, జెడ్పిటిసి వేదాంతం నాగరత్నమ్మ ఎంపీటీసీ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదాంతం నాగరత్నమ్మ మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమైన వేల పిల్లలందరికీ జగనన్న ఓ మేనమామల విద్యా కానుక పంపించారు. విద్యార్థులందరికీ షూస్, డ్రస్సులు, బ్యాగ్, పుస్తకాలు అన్ని పంపిణీ చేయడం జగనన్న పాలనలోనే సాధ్యమైందని తెలిపారు. చదువుపై జగనన్న ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారన్నారు. మన్నీల సుప్రియ మాట్లాడుతూ జగనన్న ఒక్కో విద్యా కానుక కిట్టుకు 2,400 రూపాయలు ఖర్చు చేస్తున్నారని, మన పేదింటి పిల్లలు మెరుగ్గా రాణించేలా ఆధునిక చదువులకు అనుగుణంగా జగనన్న కృషి చేస్తున్నారన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి సంగీత కుమారి మాట్లాడుతూ విద్యార్థులందరికీ జగనన్న విద్యా కానుక కింద పుస్తకాలు, బ్యాగ్, డ్రస్సులు, షూస్ టైంకి పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు